చలకుర్తి గ్రామ పెద్దలకు, పాలక మండలి సభ్యులకు మరియు మహిళా మాతాజీ లకు, ప్రత్యేకంగా యువకులకు విజ్ఞప్తి రాయప్రోలు మురళీ కృష్ణ శర్మ
ఆలేరు:
మనము ప్రతి సంవత్సరం జరుపుకొనే ఉత్సవాలు గతం లో గ్రామం లో మెయిన్ సెంటర్ లోఐకమత్యం తో ఒకే గణపతి ని పెట్టి పూజలు నిర్వహించి అన్న ప్రసాదం అందరికి వితరణ చేసేవాళ్ళం.
కానీ రాను రాను భక్తుల్లో ఐకమత్యం లోపించి వాడ వాడకు ఒక గణపతి ని పెడుతూ అనైక్యత కు కారణం అవుతున్నాము అని మురళీకృష్ణ వాపోయారు.తద్వారా భగవంతుని దగ్గర భజనకు బదులు
అస్లీల పాటలకు డాన్స్ లు, యువత గంజాయి, మత్తు పానీయాలకు అలవాటై ప్రమాదాలకు గురి అవుతూ కన్న వారి కడుపు కోతకు కారకులు అవుతున్నారు. చిన్నపిల్లలు సైతం చెడు అలవాట్లకు గురవుతున్నారు.
అలాగే ఒక వినాయకుని మండపం వద్ద దైవ భక్తి మాటున ధర్మ కార్యానికి విరుద్దంగా దేవుని సమక్షంలో నే 90% లక్షల్లో మత్తు పానీయాలకు, మధుమాంసాలకు ఖర్చు చేస్తూ ధర్మ ద్రోహానికి, దైవఆగ్రహానికి కారకులు అవుతున్నారు.
*వాతావరణ కాలుష్యం* :-
Pvc విగ్రహాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇస్తరాకుల వాడకాలు విపరీతగా పెరిగి వాతావరణ కాలుష్యం పెరగటానికి కారకులవుతున్నారు.
*ముగింపు విజ్ఞప్తి* :-
ఇలాంటి అనైఖ్యత కు కారణమయ్యే ఇలాంటి ఉత్సవాలకు అనుమతులు కల్పించకుండా గ్రామం లో ఒకే ఉత్సవ విగ్రహం( గణపతి /దుర్గ మాత విగ్రహం) అధికూడా మట్టి విగ్రహం ప్రతిష్టించి ప్రతీ ఒక్కరు అక్కడే పూజ కార్యక్రమం లు జరుపుకొని తీర్ధ ప్రసాదాలు తీసుకొని భగవంతుని అనుగ్రహం పొందేవిధంగా సౌకర్యం కల్పించి గ్రామ ఐకమత్యం కు కృషి చేసి భావితరాలకు మన గ్రామం ఆదర్శంగా నిలవాలని ఇందుకు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.
గ్రామ పంచాయతీ గ్రామ సభలో కుల పెద్దల సమక్షంలో లో తీర్మానం చేయించి గ్రామ ప్రముఖుల సంతకాలు తీసుకొని ఒక మంచి మెసేజ్ ని పరిసర గ్రామాలకు వెళ్లే విధంగా సహకరించ వలసిందిగా విజ్ఞప్తి చేసారు