సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యం అధిష్ఠాన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు పనిచేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి
ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కురుపాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో జోనల్ కో-ఆర్డినేటర్, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ
ప్రభుత్వ విప్,కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి
గరుగుబిల్లి, సెప్టెంబర్ 28, మేజర్ న్యూస్:పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జోనల్ కో-ఆర్డినేటర్, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.సోమ వారం కురుపాం మండల కేంద్రంలోని సాయి నందిని కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అరిమిల్లి రాధాకృష్ణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈసందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.నియోజకవర్గ స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే నాయకులు, కార్యకర్తల మధ్య మంచి సంబంధాలు, సమన్వయం ఉండాలని అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ శ్రేణులు అవగాహన కలిగి ఉండాలని, వాటిని నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచిం చారు.పార్టీ కోసం క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాల ని కోరారు.పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసు కుని వాటి పరిష్కారానికి కృషి చేయా లని సూచించారు.ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని పిలుపు నిచ్చారు.పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, కార్యకర్తల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్ర మాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ప్రాధా న్యం ఇస్తూ ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు దాడి రత్నాకర్, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మదారపు వెంకటేష్ మాట్లాడుతూ అధిష్ఠానం ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా సమన్వ యంతో పనిచేసి విజయఢంకా మోగించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్ర దేవ్, ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు బొంగు సురేష్, బిడ్డిక పద్మావతి, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు ఎం. తేజోవతి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ అంబటి రాంబాబు, రాష్ట్ర ట్రైకర్ బోర్డు సభ్యురాలు పువ్వుల లావణ్య, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, కురుపాం నియోజకవర్గ ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, గరుగుబిల్లి మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు, రాష్ట్ర ప్రభుత్వ నాటక రంగ అకాడమీ డైరెక్టర్ అంబటి రాంబాబు,అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు దాసరి రామారావు నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోలా రంజిత్, కురుపాం మండల పార్టీ అధ్యక్షులు కలిశెట్టి కొండయ్య, జియ్యమ్మవలస మండల పార్టీ అధ్యక్షులు జోగి భుజంగరావు, గుమ్మలక్ష్మీపురం మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్, గరుగుబిల్లి మండల పార్టీ అధ్యక్షులు మరడాన నారాయణస్వామి నాయుడు,కొమరాడ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ పాత్రుడు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.