BREAKING
దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

Select Suryaa Now
 పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక భద్రతా పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం మరోసారి తీపికబురు అందించింది. ప్రతినెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛన్లు అందించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సంకల్పానికి అనుగుణంగా, అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు మరియు ఇతర లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అరవై ఒక్క లక్షా ఎనభై వేల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2,692.34 కోట్ల భారీ మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఒకటో తేదీనే నిధులు జమ చేస్తున్న ఘనత కూటమి సర్కారుకే దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదల ఆర్థిక భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని వివరించారు.

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్ఏపీ) కింద సాంకేతిక కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన బకాయిలను సైతం పరిష్కరిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ వివరించారు. దీనిలో భాగంగా గజపతినగరం మండలంలో అర్హులైన లబ్ధిదారుల ఎన్‌ఎస్ఏపీ ఖాతాలకు ఆరు లక్షల రూపాయల నిధులను జమ చేసినట్లు తెలిపారు. సమస్యలు ఉన్న ప్రతి పింఛనుదారుడికి న్యాయం జరిగేలా పారదర్శక పద్ధతుల్లో అధికారులు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి నిధులు చెల్లిస్తున్నారని వివరించారు.

ఒకటో తేదీనే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేలిముద్రలు, ఐరిస్ లేదా ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా లబ్ధిదారులు ఊర్లో లేకపోయినా లేదా అందుబాటులో లేకపోయినా రాబోయే రోజుల్లో వారికి అందజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పింఛను పంపిణీలో ఎలాంటి అవకతవకలు, నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.