రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :-
రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :-
టి.నరసాపురం మేజర్ న్యూస్ : రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో చిన్న గురవాయి గూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని గుడికందుల జుహీ ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు టి కన్నయ్య తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థిని జుహీ కి సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కానూరు లోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన పదవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ - 2026 లో స్థానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న గుడికందుల జుహీ బాలికల అండర్ -6 విభాగంలో నాలుగు గేములకు మూడు పాయింట్లు గెలిచి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన జూహికి టోర్నమెంట్ నిర్వాహకులు మెమెంటో, ప్రశంసా పత్రం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం విజయమణి, ఎం మోహిని కుమారి, జి శ్రీదేవి, ఎస్ రవికుమార్, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్