వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు
వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు
మునుగోడు,మేజర్ న్యూస్:
వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ ఇంచార్జి కంచర్ల కృష్ణా రెడ్డి, రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డిలు అన్నారు.సోమవారం
మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చరణ్ టెక్స్‌టైల్స్ మెన్స్ వేర్ షాపు ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, యజమాని ఎడవల్లి సురేష్ కుమార్(వైఎస్కె),మరియు కుటుంబ సభ్యులను వారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు పట్టణంలో ప్రజలకు నాణ్యమైన పురుషుల దుస్తులు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం మంచి ఆదరణ పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ప్రస్తుత కాలంలో నూతన వ్యాపారాలను ప్రారంభిస్తూ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని పొందే విధంగా నాణ్యత, సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మందుల సత్యం ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి మదనబోయిన పరమేష్ యాదవ్,మండల నాయకులు మేకల శ్రీనివాస్ రెడ్డి,ఈద శరత్ బాబు, పొలగోని సైదులు,కందుల రాజు గౌడ్ ,దోటి కరుణాకర్, జిట్టగోని మల్లేష్, అయితగోని విజయ్,బండారు శ్రీనివాస్,గుర్రాల సురేష్, పగిల్ల రాము,బోయపర్తి సైదులు, కందుల లింగస్వామి, సురిగి లింగస్వామి సురిగి రవి తదితరులు పాల్గొన్నారు.