BREAKING
దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు

Select Suryaa Now
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్.  రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం.  ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్:

ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రామేశ్వరం రోడ్డులోని ఆనా బంక్ సమీపంలోని ఈశ్వర్‌రెడ్డి నగర్ ప్రాంతంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన నక్క శ్రీకాంత్, నాగేపల్లి రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులు Old 777.com యాప్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ ఎస్‌ఐ మైనుద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యల్లో నిందితుల వద్ద నుంచి రూ.9,000 నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, మట్కా, ఇతర జూదాలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ టి.వి. కొండారెడ్డి హెచ్చరించారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్, జూదాలకు ఆకర్షితులు కాకుండా దూరంగా ఉండాలని ఆయన సూచించారు. తమ ప్రాంతాల్లో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్, మట్కా లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని సీఐ తెలిపారు