BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం

Select Suryaa Now
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం

 రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమరనాద్ 

 జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్:- జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయానికి కార్యకర్తలు నాయకులందరూ సమిష్టిగా ఐక్యమత్యంతో కృషి చేయాలని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ గుడివాడ అమర్నాథ్  పిలుపునిచ్చారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం పట్టణ పార్టీ అధ్యక్షులు కర్పూరం గవరయ్యగుప్త ( నాని) ఆధ్వర్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం అవగాహన సమావేశం జరిగింది. సమావేశమునకు చింతలపూడి నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ కంభం విజయ రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ అమర నాథ్ పాల్గొని ప్రసంగించారు.  ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్ల ఎంపిక ప్రక్రియ స్థానిక నాయకుల మీద ఉందన్నారు.  చైర్మన్ పదవి ఎంపిక రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి  నిర్ణఇస్తారని తెలిపారు.  మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గతంలో మాదిరిగా కౌన్సిలర్ల  నుండి జరగడం లేదని ఓటర్ల ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానం అమలు జరుగుతుందన్నారు. స్థానిక సమస్యలు, మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుని ఎన్నికల ప్రణాళికతో ఓటర్లకు అవగాహన కల్పించవలసి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు, నష్టపోయిన వారికి, అన్యాయాలకు గురైన నాయకులకు పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు.  పార్టీలో పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులలో కూడా స్థానం కల్పించడం జరుగుతుందని చెప్పారు.  గత రెండున్నర సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు   ముఖ్యంగా మహిళలు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అందుతుండడంతో సతమతమవుతున్నారని విమర్శించారు. 48 వేల ఓటర్లలో 32 వార్డులలో ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపి పతాకాన్ని ఎగురవేసి, ఏలూరు జిల్లాలో ప్రధమంగా ఉంటుందని అమర్నాథ్  ధీమా వ్యక్తం చేశారు   సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ( డి. ఎన్  అర్ ), ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు  ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి, మచిలీపట్నం పార్లమెంట్ పరిచర్యకులు జెట్టి గురునాధరావు, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సిపికి ఘనవిజయం చేకూర్చాలని కోరారు.  గతంలో జరిగిన విధంగా పొరపాట్లు జరగకుండా అందరూ ఐక్యమత్యంతో విభేదాలు లేకుండా ముందుకు వెళ్లాలని తెలిపారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్త, పార్టీ నాయకులు బి వి ఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్,  ముప్పిడి శ్రీనివాసరావు,కంచర్ల వాసవి రత్నం, ముప్పిడి వీరాంజనేయులు, అయినాల రమణమూర్తి, బత్తిన చిన్న, షేక్ అక్బర్, కనుమూరి లావణ్య, జెట్టి ఆదిత్య,గెడ్డం శ్రీను, ఉమాదేవి, శీమకుర్తి శ్రీనివాసరావు పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు

 కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం