BREAKING
దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

రాప్ తొలగింపుపై రగడ

Select Suryaa Now
రాప్ తొలగింపుపై రగడ
పొలాలకు వెళ్లే దారి విషయంలో వివాదం.. ఇరువర్గాలపై కేసులు
నవాబుపేట, మేజర్ న్యూస్:మాదిరెడ్డిపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న సిమెంట్ రాప్‌ను తొలగించే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పొలాలకు వెళ్లే దారి విషయంలో తలెత్తిన వివాదం చివరకు గొడవకు దారితీసింది. ఈ ఘటనపై ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు నవాబుపేట ఎస్‌ఐ గిరి తెలిపారు.
ఇంటి వద్ద రాప్ ఏర్పాటు
గ్రామానికి చెందిన దగ్గుల అనంతరాములు తండ్రి లక్ష్మయ్య తన ఇంటి వద్ద బైకులు, కారు ఇంట్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా చిన్న సిమెంట్ రాప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ రాప్ ఉన్న ప్రదేశం నుంచి పొలాలకు వెళ్లే దారి ఉందని పేర్కొంటూ అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దానిని తొలగించాలని కోరారు.
తొలగించే ప్రయత్నంతో వివాదం
ఈ క్రమంలో చాకలి రామచంద్రి, ఎల్లకొండ నరసింహులు, డిల్లెపు గోపాల్, డిల్లెపు శేఖర్ తదితరులు కలిసి దగ్గుల అనంతరాములు ఇంటి వద్ద ఉన్న సిమెంట్ రాప్‌ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది.
ఇరువర్గాలపై కేసులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రిపోర్టర్ ఎం.వెంకటేష్