BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం

Select Suryaa Now
ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక  జంగారెడ్డిగూడెం

ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్

జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన రాజకీయ శాస్త్ర పరిశోధకుడు డా. గోపే నాగసుబ్బారావు ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌ 2026–27కు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి ఈ ఫెలోషిప్‌ను ప్రకటించింది.ఫెలోషిప్‌లో భాగంగా ‘భారత రాజకీయాల్లో మహిళా కేబినెట్ మంత్రులు (1952–2026): రాజకీయ నాయకత్వం, విధాన రూపకల్పన, దేశ నిర్మాణానికి వారి సహకారం’ అనే అంశంపై ఆయన పరిశోధన చేయనున్నారు. మహిళా మంత్రుల రాజకీయ నాయకత్వం, నిర్ణయాధికారం, పరిపాలనా బాధ్యతలు, విధాన రూపకల్పనలో వారి పాత్రను అధ్యయనం చేయనున్నారు.డా. గోపే హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మహిళలు–రాజకీయాలు, ప్రజా విధానం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సామాజిక న్యాయం తదితర అంశాల్లో పరిశోధన అనుభవం ఉంది. గతంలో ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్‌ డాక్టోరల్ ఫెలోషిప్ కూడా పొందారు. తాజా ఎంపికపై పలువురు అభినందనలు తెలిపారు.

 కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం