ఆర్జీలపై అలసత్వం వద్దు
- కలెక్టర్ నారాయణ రెడ్డి
విద్యార్థుల సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేసి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్ఆర్ఎస్, విద్యార్థుల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియల్లో లోపాలు ఉండకూడదన్నారు. పాఠశాల స్థాయిలో బాధ్యతలు స్పష్టంగా కేటాయించి, రోజువారీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
విద్యార్థుల మార్పులు, టీసీలు, ఫీజుల సమస్యలు, ఆధార్ మిస్మ్యాచ్‌లు, ఆన్లైన్ పెండింగ్ దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. యూనిఫాం క్లాత్ సరఫరా, స్టిచింగ్ పనులు వేగవంతం చేసి దసరా నాటికి అన్ని సామగ్రి అందించాలని తెలిపారు.
పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని, రేపటి సాయంత్రంలోగా పురోగతి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
వి శ్రీనివాసచారి : మేజర్ న్యూస్, రంగారెడ్డి.