BREAKING
దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

*పరికరాల పంపిణీ జోరు..!*

Select Suryaa Now
*పరికరాల పంపిణీ జోరు..!*

 దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ మై చేతుల మీదుగా ALIMCO సహకారంతో హ్యాండ్ స్టిక్స్ సహా పరికరాలు అందజేశారు. వీటితో దివ్యాంగులు స్వయం ఆధారితంగా జీవనం సాగించగలరని అధికారులు తెలిపారు.

ఇక వృద్ధుల వారోత్సవం సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధుల భద్రత, హక్కులు, సంక్షేమంపై జిల్లా సంక్షేమ అధికారి శాంతి శ్రీ వివరించారు. వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు గౌరవంతో వ్యవహరించాలని సూచించారు.

*సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి*  
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి బాబు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, మెసేజ్‌లను నమ్మవద్దని సూచించారు. OTP, బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

*వృద్ధుల రక్షణ సమాజ బాధ్యత*
వృద్ధులపై నిర్లక్ష్యం, వేధింపులు ఎదురైతే వెంటనే అధికారులను ఆశ్రయించాలని తెలిపారు. వృద్ధులకు గౌరవప్రదమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TASCA సభ్యులు, పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బి శ్రీనివాసచారి : మేజర్ న్యూస్, రంగారెడ్డి.