BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు




*బిఆర్ఎస్ దామరచర్ల మండలం యువ నాయకుల బైరం గోపి*

దామరచర్ల మేజర్ న్యూస్

గత కొన్ని రోజుల కిందట బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని తాళ్ల వీరప్పగూడెం గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి  యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి సరిగా లేదని, ఏ కారణం చేత విద్యుత్ ఉత్పత్తి సరిగా ఉత్పత్తి  కావడం లేదు అని తెలుసుకోవడం కోసం ఈ మధ్యకాలంలో వారు ప్లాంటును సందర్శించడం జరిగింది.బీఆర్ఎస్ నాయకులు ప్లాంటును సందర్శించి వెళ్లిపోయిన అనంతరం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి, అసత్యపు ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు మీద  చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం నాడు బీఆర్ఎస్ యువజన నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండల కాంగ్రెస్ నాయకులు వారి యొక్క స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ప్రభుత్వాలు మారతాయి కాని వ్యక్తిత్వం ముఖ్యమని, గత ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తే, ఈ ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు విద్యుత్ పంపిణీ చేయకుండా రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ నాయకులు మత్తులో ఉండి మాట్లాడుతున్నారని, కొందరు కాంగ్రెస్ నాయకులకు మా బీఆర్ఎస్ నాయకులను విమర్శ చేస్తే స్థాయి కూడా వారికి లేదని తెలియజేశారు.ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదు
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సిగ్గుచేటని,
వ్యక్తిగత విమర్శలపై దృష్టి పెట్టడం కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పరిపాలన చేయడం నేర్చుకోవాలని సూచించారు. మేము కూడా పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మాజీ ఏఎంసీ చైర్మన్ సంపత్,ప్రకాష్,వినోద్ నాయక్,గోపి కొండారపు బ్రదర్స్,మాజీ సర్పంచ్ లు లావూరి శ్రీను,రమేష్,సచిన్,లింగా రెడ్డి,లింగ,వాంకుడోత్ రవీందర్,వీర నాయక్,దస్రూ నాయక్,నాయకులు  రఫీ,శ్రీను,బాల,హుస్సేన్,పండిత్ఆలంపల్లి మనోహర్,ఎల్లయ్యా తదితరులు పాల్గొన్నారు....