BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి

Select Suryaa Now
ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి 

చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం, చిన్నరాజు పల్లి గ్రామానికి చెందిన పి. కృష్ణమూర్తి (55) ప్రమాదవశాత్తు తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.
మృతుడు కృష్ణమూర్తి గత కొంతకాలంగా రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ, తారకరామ నగర్ ఫ్లాట్స్‌లో నివాసముంటూ, ఆంజనేయపురానికి చెందిన ఇలవర్షన్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 27 తేదీరాత్రి సమయంలో ఇతను మద్యం సేవించి, శ్రీనివాసపురం గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో గల కమిటీ హాల్ వరండా వద్దకు వెళ్లాడు. మద్యం మత్తులో అదుపు తప్పి వెనక్కి పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మృతుని కుమార్తె పి. లిఖిత ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన తండ్రి మద్యం మత్తులోనే కిందపడి మరణించాడని, ఈ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష (పోస్ట్‌మార్టం) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నాము.
-