పలు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం
*పలు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం*
*ఐ సి డి ఎస్ వెంగళరావు నగర్ సెక్టర్ సూపర్వైజర్ అన్నం రాజేశ్వరి*
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్:
9వ రాష్ట్రీయ పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా నెల్లూరు అర్బన్ మరియు రూరల్ పరిధిలో సోమవారం నాడు వెంగళరావు నగర్ సెక్టర్ పరిధిలోని ఎల్ ఎన్ పురం, బారాషా దర్గా 2 అంగన్వాడీ కేంద్రంలో జె వి ఆర్ కాలనీ యూ హెచ్ సి డాక్టర్ కుసుమ కుమారి మరియు వెంగళరావు నగర్ సెక్టర్ సూపర్వైజర్ అన్నం రాజేశ్వరి ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు,కిశోర బాలికలు అందరికీ పోష్టికాహారం మరియు ఆహార వైవిద్యం లో మన చుట్టూ ఉండే వనరులలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని మరియు ఇంటి పెరటిలో సులభంగా పెరిగే మంచి ఆకులతో అంగనవాడి కేంద్రంలో మునగాకు పొడి తయారు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించడం జరిగింది. ఆహార వైవిధ్యంలో శరీరానికి కావలసిన తగినంత ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయని తెలియజేశారు. అలాగే అంగన్వాడి ఉత్సవం కార్యక్రమం భాగంగా ఫ్రీ స్కూలు తల్లులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు బుజ్జమ్మ, లక్ష్మీ,సుగుణ,నాగేంద్రి మరియు ఏఎన్ఎం,అంగన్వాడి హెల్పర్లు, ఆశా వర్కర్లు తల్లులు తదితరులు పాల్గొనడం జరిగింది.