BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన

Select Suryaa Now
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన

ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన 

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్:

 ప్రకృతి వ్యవసాయంలో సాగు  విధానాన్ని  ఇండోనేషియా కి చెందిన ఆస్టుంగ్‌కారా వే ఆర్గనైజేషన్ నుండి 9 మంది సభ్యులు, బోర్డర్‌లెస్ ఫౌండేషన్ (థాయిలాండ్) నుండి ఇద్దరు  సభ్యుల బృందం  సోమవారం  జిల్లాలోని ద్వారకా తిరుమల మండలము గుండుగొలను గుంట గ్రామం లో పర్యటించారు.  ఈ బృందాలు జిల్లాలో ఈనెల 30వ తేదీ వరకు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలిస్తారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్  . బి.వెంకటేష్   ప్రకృతి వ్యవసాయం అమలు చేయడానికి కావలసిన 9 సార్వత్రిక సూత్రాలను బృంద సభ్యులకు వివరించారు.అనంతరం గుండుగొలను గుంట గ్రామంలో ఓ.గోపాలకృష్ణ చే నిర్వహించబడుతున్న శ్రీ సుబ్రహ్మన్యేశ్వర బయో రిసోర్స్ సెంటర్ ను సందర్శించారు.. ఆ సెంటరు నిర్వహించబడుతున్న విధానము, ఆవశ్యకత, అవసరము తెలియజేసిన తరువాత వివిధ పంటలకు పురుగు, తెగుళ్ళు ను నివారించడానికి తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు , వాటికి కావలసిన కషాయాలైన అగ్నాస్త్రము,వేపగింగల కషాయము, జీవ ఉత్ప్రేరకాలైన జీవామ్రుతము, ఘన జీవామ్రుతము, గ్రోత్ ప్రోమోటర్స్ కోడిగుడ్డు- నిమ్మరసం ద్రావణం , విత్తన గుళికలు తయారు విధానాన్ని గోపాలకృష్ణ బృందం సబ్యులకు తెలియజేసారు .  అక్కడనే వివిధ రకాల కూరగాయలు, పండ్లమోక్కలతో ఉన్న ATM మోడలును సభ్యులు సందర్శించారు. అనంతరం.  రైతు సాధికార సంస్థ తరపున  అకాడమి లో  నిర్వహించబడుతున్న రైతు శాస్త్రవేత్త కోర్స్ చదువుతున్న FS లు మెంటార్ లతో కోర్స్ గురించి . మరియు ప్రకృతి వ్యవసాయ విభాగములో పనిచేస్తున్న వివిధ స్థాయి ల యొక్కవివరములు, వారి పని విధానము గురించి సభ్యులు అడిగి తెలుసుకున్నారు.  తదుపరి మహిళా సంఘాల సభ్యులతో ప్రకృతి వ్యవసాయంలో వారి పాత్ర , రైతులతో ఎ విధముగా కలసి పనిచేస్తున్నారు, పెరటి తోటలగురించి వివరాలు, ప్రకృతి వ్యవసాయం లో పండించిన ఆహార ఉత్పత్తులను వినియోగించే విధానము, ఆరోగ్యము , పోషణ, పుస్తకనిర్వాహణ మొదలగు అంశాలను ప్రతినిధి బృందానికి తెలియజేశారు.ఈ కార్యక్రములో ప్రతినిధి బృందంతో పాటు   అడిషనల్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ . షేక్ .మహబూబ్ వలి   DPP సత్య,  ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు ఓ.గోపాల కృష్ణ, జంగా గణేష్ మొదలగు వారు పాల్గొన్నారు.

 

బృంద సభ్యులు 

• కెనడా: తిమోతీ జోసెఫ్ ఫిజాల్ (Timothy Joseph Fijal)

• దక్షిణాఫ్రికా: షానన్ లీ గ్రీఫ్ (Shanon Leigh Greef)

• ఇండోనేషియా:

o సోఫియా యోహానా (Sophia Yohana)

o ఐ గుస్తీ న్గురా ప్రభూ వీర (I Gusti Ngurah Prabu Wira)

o అల్వాన్ విజయ కుసుమ (Alwan Wijaya Kusuma)

o నినా హార్నిదియా (Nina Hernidiah)

o నధిఫ్ అల్వాన్ కమిల్ (Nadhif Alwan Kamil)

o ని కేతుత్ విద్యా అస్తుతి (Ni Ketut Widya Astuti)

• ఆస్ట్రేలియా: క్రెయిగ్ ఆండ్రూ ఎల్లిస్ (Craig Andrew Ellis)

• జపాన్: యాగిషితా టోమోనోబు (Yagishita Tomonobu)

• మాయన్మార్ (బర్మా): ఆంగ్ ఫ్యో ఓ