BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

రెసిడెన్షియల్ విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
రెసిడెన్షియల్ విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి


కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్‌

వికారాబాద్ నుంచి పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వసతులు కల్పించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి , మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28):రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు, పారిశుధ్యం కల్పించడంతో పాటు వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల భద్రత, ఆహారం, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు.కలెక్టర్లు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సంజయ్ జాజు ఆదేశించారు. ఆహారం తయారీ, నిల్వ, పంపిణీలో నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని, వంటశాలల పరిశుభ్రత, విద్యార్థులు–ఉపాధ్యాయుల హాజరు, మౌలిక వసతులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.కొన్ని ప్రాంతాల్లో ఆహార విషబాధ, ఎలుకలు, పాముకాటు వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వంటశాలలను ఆధునీకరించే అవకాశం ఉన్న చోట పనులను త్వరగా చేపట్టాలని సూచించారు.
*చలికాలానికి ముందే ఏర్పాట్లు
రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు, అవసరమైన దుప్పట్లు అందుబాటులో ఉంచాలని సీఎస్ ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో అవసరమైన మరమ్మతులు, మార్పులు చేపట్టేలా భవన యజమానులతో కలెక్టర్లు సమావేశం కావాలని సూచించారు.
*దసరా నాటికి యూనిఫారాలు
దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే యూనిఫాం క్లాత్ జిల్లాలకు చేరినందున కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.రెసిడెన్షియల్ విద్యాసంస్థల పరిస్థితులను పర్యవేక్షించేందుకు రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించాలని, సమస్యలు, వాటి పరిష్కార చర్యల వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎస్ సూచించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈవో సుధీర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఘని, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జయపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి మాధవరెడ్డి, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.