BREAKING
విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం

శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు

Select Suryaa Now
శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు

అనంతపురం బ్యూరో 

 

శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు

తాడిపత్రి: సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సుధాకర్, ఎంఈఓ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్, అడ్వకేట్ పీవీ ప్రతాపరెడ్డి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వాన కమిటీ సభ్యుడు జంగం రెడ్డి అంకల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులు, సమాజాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి చవ్వ రంగనాథ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్న రంగనాయకులు, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.