BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

Select Suryaa Now
యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం బ్యూరో 

 

యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం, సెప్టెంబర్ 28: 

 

అనంతపురం నగరంలోని కెఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థినులతో ముచ్చటించారు. కళాశాలలోని విద్యా, మౌలిక వసతులు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కళాశాలలో త్వరలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు అదనపు తరగతి గదుల కోసం కృషి చేస్తామని ఎంపీ తెలిపారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదవడంతో పాటు కమ్యూనికేషన్, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జాబ్ మేళాలు, పోటీ పరీక్షలకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి, అన్నపూర్ణ, హాస్పిటల్ కమిటీ సభ్యులు నరసింహులు, వెంకటేశ్వర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.