BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు

Select Suryaa Now
మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు

అనంతపురం బ్యూరో 

మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు

అనంతపురం, సెప్టెంబర్ 28:

 

 పీఎం సూర్య ఘర్ పథకం కింద నిర్వహించనున్న మోడల్ సోలార్ విలేజ్ కాంపిటీషన్‌కు అనంతపురం జిల్లాలో నార్పల, యాడికి, కంబదూరు, రాప్తాడు, ఉరవకొండ గ్రామాలు ఎంపికయ్యాయి. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మూడు నెలలపాటు జరిగే ఈ పోటీలో అత్యధిక సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్లు ఏర్పాటు చేసిన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం రూ.1 కోటి ప్రోత్సాహక నిధులు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎంపికైన గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సోలార్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, నెడ్‌క్యాప్ మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.