BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య

Select Suryaa Now
అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబర్, 28):
అంకుశాపూర్‌లోని భాగ్యనగర్ హ్యాచరీస్‌లో కూలీగా పనిచేస్తున్న అంధుగుల రాజు (43) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వాసి అయిన రాజు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఐదేళ్లుగా అంకుశాపూర్‌లో నివాసముంటున్నాడు. పెద్ద కుమార్తె వివాహం కోసం చేసిన అప్పుల కారణంగా మద్యానికి బానిసై, నాలుగు రోజులుగా పనికి వెళ్లకుండా మద్యం సేవిస్తున్నాడు. సోమవారం భార్య పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో పైకప్పుకు చీరతో ఉరివేసుకున్నాడు. స్థానికులు కోటేశ్వరరావు, షాబుద్దీన్ గమనించి కిందకు దించగా అప్పటికే మృతి చెందాడు. భార్య స్వర్ణకుమారి ఫిర్యాదుతో ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.రిపోర్టర్ గుర్రం రమేష్.