BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..!

Select Suryaa Now
వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..!

కేశవరావు(కేకే) తనయుడిపై భూదౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ రైతుల ఆరోపణలు

వివాదాస్పద భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. కోర్టు తీర్పు వరకు ఇరువర్గాలు భూమిలోకి వెళ్లొద్దన్న ఎస్‌ఐ

పూడూరు, మేజర్ న్యూస్( సెప్టెంబర్ 28):
పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలోని భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని కొందరు బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వడ్డెర రైతులు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు కేకే తనయుడు వెంకటేశ్వరరావు తమ భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని వడ్డెర అంతయ్య, ఎల్లయ్య, రవి, రామయ్య, వెంకటయ్య, యాదయ్య ఆరోపించారు. తమ భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు అధికారులను కోరారు.

*10 ఎకరాలపై వివాదం

మీర్జాపూర్ గ్రామంలోని సర్వే నంబర్‌ 20లో ఉన్న సుమారు 10 ఎకరాల భూమిపై ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూమిని పరిశీలించారు. ఎంఆర్‌ఐ సుదర్శన్, జీపీఓ మొగులప్ప, అసిస్టెంట్ సర్వేయర్ చంటి ఇరువర్గాలకు సమాచారం ఇచ్చి భూమిని పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.

*1973 నుంచి సాగు చేస్తున్నామని రైతుల వెల్లడి

1973-74 నుంచి తమ పూర్వీకులు రక్షిత కౌలుదారులుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని రైతులు తెలిపారు. రాములమ్మ, వెంకట సుబ్బమ్మ భర్త సంగారెడ్డి నుంచి వడ్డెర ఎల్లయ్యకు రక్షిత కౌలుదారుగా భూమి సంక్రమించిందని పేర్కొన్నారు. భూమికి సంబంధించిన పాత పత్రాలు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

*తప్పుడు దస్తావేజులు సృష్టించారంటూ ఆరోపణ

2005లో నరసింహరెడ్డి నుంచి గద్వాల విజయలక్ష్మి, కంచర్ల కవిత, వెంకటేశ్వరరావులు భూమిని కొనుగోలు చేసినట్లు దస్తావేజులు సృష్టించి తమ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ భూవివాదం హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫార్వర్డ్ అయినట్లు వారు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

*కోర్టు తీర్పు వచ్చే వరకు భూమిలోకి రావొద్దు: ఎస్సై భరత్ రెడ్డి 

వివాదాస్పద భూమిపై న్యాయస్థానం తుది నిర్ణయం వెలువడే వరకు ఇరువర్గాల వారు భూమిలోకి ప్రవేశించకుండా సంయమనం పాటించాలని ఎస్‌ఐ భరత్‌రెడ్డి సూచించినట్లు రైతులు తెలిపారు. పేరు, పలుకుబడి, ఆర్థిక బలం ఉన్నవారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమ భూములను కాపాడి న్యాయం చేయాలని వడ్డెర రైతులు జిల్లా అధికారులను విజ్ఞప్తి చేశారు.రిపోర్టర్ గణపురం శ్రీరాములు.