BREAKING
పలు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు 800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం శోభాయమానంగా పార్వతీపరమేశ్వరుల ప్రాకారోత్సవం జనసేన అభ్యర్థుల వినతుల స్వీకరణ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి టిడిపి నాయకుడు కన్నన్ రెడ్డి జన్మదిన వేడుకలు జడ్పీటీసీ అధ్యక్షుడు పాలూరి మాల్యాద్రి రెడ్డికి ఘన సన్మానం క్యాద్గిరా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం బేస్మెంట్ వరకే పరిమితం సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన ఆచార్య అల్లం శ్రీనివాసరావుకు మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ‘నమో సేవా గాథ’ ప్రత్యేక వాహనం ప్రారంభం వాయుగుండంతో దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే పునరుద్ధరిస్తాం గ్రామాల సర్వతోముఖాభివృద్ధే పల్లె పండుగ లక్ష్యం-మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

నల్గొండ జిల్లా బ్యూరో మేజర్ న్యూస్...
విద్యార్థులు బాగా చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సోమవారం రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో ఇదే అంశంపై సమీక్షిస్తూ విద్యార్థులు బాగా చదివేందుకు  విద్యాసంస్థల్లో సరైన సౌకర్యాలు కల్పించి మంచి చదువు ద్వారా పిల్లల్ని  తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల నమోదు, నూటికి నూరు శాతం హాజరు,  కలుషిత ఆహారం లేకుండా, శానిటేషన్  నూటికి నూరు శాతం ఉండేలా తప్పనిసరిగా అన్ని విద్యాసంస్థలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో పాటు, జిల్లాలోని సీనియర్ అధికారులు కూడా ప్రతి విద్యా సంస్థను తనిఖీ చేసి ఆయా పాఠశాలలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్ధేందుకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలను  నూటికి నూరు శాతం పరిశీలన జరిపి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే జిల్లాలో ఉన్న 1245 పాఠశాలలకు గాను 1190 పాఠశాలల్లో పరిశీలించగా, 58 పాఠశాలలో టాయిలెట్స్ లేవని తమ దృష్టికి వచ్చిందని, వీటిని ఏర్పాటు చేస్తే నూరు శాతం టాయిలెట్లు పూర్తి చేసిన వారమవుతామన్నారు. సీనియర్ అధికారులు ప్రతి పాఠశాలలో ఒక అంశాన్ని  తీసుకొని రానున్న 15, నెల రోజుల్లో
అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్యలో మంచి ఫలితాలు వచ్చే విధంగా చూసే బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా క్లిష్టమైన సమస్యలను ముందుగా గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అనంతరం పిల్లల విద్యను పెంపొందించడంపై దృష్టి సారించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
      అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రెండు అంశాల పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలుషిత ఆహారం, పాము, ఎలుక కాట్లు, తదితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పాఠశాలను సీనియర్  అధికారులైన గ్రూప్ వన్ ,గ్రూప్ టు అధికారులు చూడాల్సిన అవసరం ఉందని, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పాఠశాలలు, హాస్టళ్లు చూడాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు నూటికి నూరు శాతం ఉండాలని, అన్ని పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, అద్దే భవనాలలో ఉండే పాఠశాలలకు సంబంధించిన అద్దెను వెంటనే చెల్లించాల్సి ఉందని, అక్టోబర్ 25 నాటికి అన్ని పాఠశాలల్లో యూనిఫార్మ్స్ పంపిణీ పూర్తి కావాలని ,ఎఫ్ ఆర్ ఎస్ పై కలెక్టర్లు నిరంతరం సమీక్షించాలని, అలాగే పాఠశాలలో ఉన్న ల్యాబ్స్ ను వినియోగించుకోవాలని, డాష్ బోర్డును క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపి కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు, టి ఎస్ ఎం ఐ డి సి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులుతదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.