BREAKING
ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ జయంతి ‘రాయవలస’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి: శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : - పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :- చలకుర్తి గ్రామ పెద్దలకు, పాలక మండలి సభ్యులకు మరియు మహిళా మాతాజీ లకు, ప్రత్యేకంగా యువకులకు విజ్ఞప్తి రాయప్రోలు మురళీ కృష్ణ శర్మ మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు గుర్తింపు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్

నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి

Select Suryaa Now
నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం, మేజర్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, నిర్ణీత గడువులోగా సంతృప్తికర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, డీఆర్వో పి. గ్లోరియా తదితర అధికారులు ప్రజల నుంచి 161 పీజీఆర్‌ఎస్, 42 రెవెన్యూ ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌ ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించి, పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదేపదే పునరావృతమవుతున్న సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవానిలంకలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తికాని పనులకు అవసరమైన నిధులపై ప్రభుత్వానికి నివేదికలు పంపేలా డీఎల్‌డీవో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

లంక గ్రామాలపై అప్రమత్తత గోదావరి వరదల నేపథ్యంలో నది పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య, పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు చెత్త సమస్య, రహదారి ఆక్రమణలు, వికలాంగుల పింఛన్లు, ఇంటి స్థలాల్లో నిర్మాణాలకు అడ్డంకులు, భూముల రీసర్వేలో తలెత్తిన సమస్యలు, వృద్ధాప్య పింఛన్ తదితర అంశాలపై ఫిర్యాదులు సమర్పించారు.

 శ్రీనివాస్ భీమవరం

కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.