telanagana
మూడుచింతలపల్లిలో మట్టి మాఫియా జోరు..!
రెవెన్యూ అధికారుల అండదండలున్నాయా..?
మమ్మల్ని అడ్డుకునేది ఎవరు…?.. యథేచ్ఛగా మట్టి తరలింపు..…
ఓ ఆర్‌ఐ తీరుపై తీవ్ర ఆరోపణలు..…
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28):మూడుచింతలపల్లి మండల పరిధిలో మట్టి తవ్వకాలు, అక్రమ తరలింపుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మూడుచింతలపల్లి మండల పరిధిలో రాత్రింబవళ్లు మట్టి తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు, నిబంధనలను పట్టించుకోకుండా మట్టి తవ్వకాలు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపును అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఓ ఆర్ ఐ మట్టి తవ్వకాల నిర్వాహకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి తరలింపు వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మట్టి తవ్వకాలపై విచారణ చేపట్టి, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.