BREAKING
వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్ కాల్వబుగ్గలో భక్తజన సందోహం!** కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. 'రికార్డ్' టైటిల్ రివీల్ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు ఆధార్ చూపిస్తే చాలు మూడు రోజులు సినిమా ఫ్రీ.. 'ఆలోచన' టీమ్ బంపర్ ఆఫర్! అనిరుధ్-కావ్య రిసెప్షన్.. ధోనితో విజయ్-రష్మిక సందడి అనన్య నాగళ్ల 'ది బ్రేకింగ్ న్యూస్' ట్రైలర్ రిలీజ్.. డిసెంబర్ 11న థియేటర్లలోకి

800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి

Select Suryaa Now
800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి

అక్టోబర్ 3న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్

800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం, మేజర్ న్యూస్: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తణుకులోని ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాలలో అక్టోబర్ 3న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ డ్రైవ్‌లో సుమారు 13 ప్రముఖ కంపెనీలతో పాటు ఇతర సంస్థల్లో 800కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ డ్రైవ్‌కు హాజరుకావచ్చని, ఆయా కంపెనీల నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.మరిన్ని వివరాలకు 7330803719, 9618560188 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, డీఆర్వో పి. గ్లోరియా, డిప్యూటీ కలెక్టర్ బి.పి. పెంచల ప్రభాకర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోకమాన్, ఎన్‌సీఎస్ వై.పి. కిషోర్ రెడ్డి, పీజీఆర్‌ఎస్ ప్రత్యేక అధికారి వై. దోసిరెడ్డి, డ్వామా పీడీ డా. కె.సి.హెచ్. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం