108 అంబులెన్స్ లో ప్రసవం
- తల్లి బిడ్డలు క్షేమం
-వనస్థలిపురంలో ఏరియా ఆసుపత్రికి తరలింపు
- మెడికల్ టెక్నీషియన్ సురేందర్, పైలెట్ యాదయ్య పై ప్రశాంశలు.
108 అంబులెన్స్ లో నిండు గర్భిణి మహిళా ప్రసవించింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. సంఘటన యాచారం ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిలో చోటు చేసుకుంది. యాచారం పరిసర ప్రాంతాలలో వ్యవసాయ పనుల కోసం, ఇతర ప్రాంతాల నుండి జీవనోపాధి సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య భర్తలు హెబ్సీభ, వినోద్, భార్య ను యాచారం ప్రభుత్వాసుపత్రికి చూపించుకోవడానికి వచ్చారు, వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గర్భిణీకి మూడవ కాన్పు, మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు పెద్ద ఆస్పత్రికి 108 తరలిస్తుండగా, మార్గమధ్యంలో ఆ గర్భిణీకి నొప్పులు రావడంతో అంబులెన్స్ సిబ్బంది, వెంటనే అప్రమత్తమయ్యారు. అంబులెన్స్ ని రోడ్డు ప్రక్కన నిలిపి, మెడికల్ టెక్నీషియన్ సురేందర్ నిండు గర్భిణీ నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. గర్భిణి బంధువులు అంబులెన్స్ సేవలను అభినందించారు. మెరుగైన వైద్యం కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెడికల్ టెక్నీషియన్ సురేందర్ , పైలట్ యాదయ్యను వారి సేవలను గుర్తించి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను సద్వినియం చేసుకోవాలని కోరారు.