అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు
గూడూరు(చిల్లకూరు), మేజర్‌న్యూస్
చిల్లకూరు మండల పరిధిలోని చింతవరం, అల్లిపురం, తిక్కవరం, తిక్కవరం (ఎస్‌టి), తిప్పగుంటపాళెం, తిప్పగుంటపాళెం(ఎస్‌సి), యోగీశ్వరనిపల్లి, పాలిచర్లవారిపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్‌వైజర్ శివజ్యోతి ఆద్వర్యంలో కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీలు, తల్లులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషకాహారం ప్రాధాన్యత, రోజువారీ ఆహారంలో ఏయే పోషక పదార్థాలను చేర్చుకోవాలి, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లులకు సూపర్ వైజర్ అవగాహన కల్పించారు. చిన్నారులకు వయస్సుకు తగిన సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం ద్వారా చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో తల్లులకు వివరించడం జరిగింది. అంగన్వాడీ ప్రీస్కూల్ పిల్లలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్న తల్లులను అభినందిస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తూ, విద్యాభివృద్ధి మరియు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న తల్లులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల సేవలను కూడా తల్లులు అభినందించారు. అల్లిపురం అంగన్వాడీ కార్యకర్త జయమ్మ, చింతవరం అంగన్వాడీ కార్యకర్త అలాగే సుమతి, శాంతి తదితర అంగన్వాడీ కార్యకర్తలను తల్లుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సాయమ్మ, అరుణ, అమరావతి, సుమతి, రేణుక, అల్లిపురం (ఎస్‌టి) వెంకట రమణమ్మ, రోజ, రమణమ్మ, లక్ష్మీ, ప్రభావతి, పద్మ, షాకీర తదితరులు పాల్గొన్నారు.