BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

అధికారుల రాకకోసం బాధితులు.. ప్రజాసేవ కోసం ఖాళీ కుర్చీలు…!

Select Suryaa Now
అధికారుల రాకకోసం బాధితులు.. ప్రజాసేవ కోసం ఖాళీ కుర్చీలు…!
కలెక్టరేట్ ముందే అటకెక్కిన సమయపాలన
ఉదయం 11:30 దాటినా తెరుచుకోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు
బయోమెట్రిక్ హాజరును కఠినతరం చేయాలని స్థానికుల నిరసన
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28): ప్రభుత్వ కార్యాలయంలో గడియారం ముల్లు మధ్యాహ్నాన్ని తాకుతున్నా.. అధికారుల సీట్లలో మాత్రం నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది! సమయపాలన పాటించి ప్రజాసేవ చేయాల్సిన సర్కారీ యంత్రాంగం 'మా తీరే వేరు' అంటూ నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒకవైపు అత్యవసర పనుల కోసం, ధృవపత్రాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులు ఆశగా ఎదురుచూస్తుంటే, మరోవైపు బాధ్యతగల అధికారుల రాకకోసం కార్యాలయాల్లోని కుర్చీలు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. స్వయంగా జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న శామీర్‌పేట మండల కేంద్రంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 11:30 దాటినా విధులకు హాజరుకాకపోవడం అధికారుల బరితెగింపునకు అద్దం పడుతోంది.
 
*తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనం:
           మండలంలో అత్యంత కీలకమైన తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11:30 గంటలు దాటినా ప్రధాన అధికారులెవరూ సీట్లలో లేకపోవడం గమనార్హం. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, మండల సర్వేయర్లు ఎవరూ విధులకు హాజరుకాలేదు. కార్యాలయంలో కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, రికార్డు అసిస్టెంట్, అటెండర్ మాత్రమే ఉన్నారు. తమ పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 15 మందికి పైగా సామాన్య ప్రజలు అధికారుల కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు.
         
*విధులకు అధికారుల మంగళం:
సమయం మధ్యాహ్నం కావస్తున్నా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంతో పాటు వ్యవసాయ శాఖ కార్యాలయాలు కనీసం తెరుచుకోలేదు. ఆయా కార్యాలయాల ప్రధాన గుమ్మాలకు వేలాడుతున్న తాళాలే అధికారుల సమయపాలనకు నిదర్శనంగా నిలిచాయి. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న కీలక శాఖలే ఇలా తాళాలతో దర్శనమిస్తుంటే జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎక్కడుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
*11:30 గంటలకు మొదలైన ఊడ్చే పనులు..!:
మరోవైపు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కేవలం ఒక అటెండర్ మాత్రమే కూర్చుని ఉన్నారు. ఇక నీటిపారుదల శాఖ కార్యాలయానికి వస్తే, 11:30 గంటలకు కూడా అధికారులు, ఇంజనీర్లు ఎవరూ విధులకు హాజరుకాకపోగా, అప్పుడే కార్యాలయాన్ని ఊడ్చే పనులు నడుస్తుండటం అక్కడి పనితీరుకు అద్దం పడుతోంది. అయితే సమయానికి ఎందుకు రాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే "ఫీల్డ్ వర్క్‌లో ఉన్నాం" అని, సర్వే ప్రక్రియలో తీరిక లేకుండా ఉన్నామని తప్పించుకునే సమాధానాలు చెప్పడం అధికారులకు అలవాటుగా మారిపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
 
*చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్:
         అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ సమయపాలనను గాలికొదిలేసి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే బయోమెట్రిక్ హాజరును కఠినతరం చేసి, సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.