BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు

Select Suryaa Now
టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు

*పార్టీలో చేరిన మంగళగిరి పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు కుటుంబం*

*తాడేపల్లి రూరల్ ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్ రెడ్డి*

*తాడేపల్లి పట్టణానికి చెందిన దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మాజీ ప్రత్యేక ఆహ్వానితులు, వైసీపీ సీనియర్ నేత జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

*నిడమర్రుకు చెందిన వైసీపీ సీనియర్ నేత కట్టెపోగు బాబురావు*

*గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణ*

*అందరికీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి లోకేష్*

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :

స్థానిక ఎన్నికల వేళ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన పలువురు సీనియర్ వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంగళగిరి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, ఆయన సతీమణి, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. తాడేపల్లి రూరల్ ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్ రెడ్డి, కళ్లం సాంబిరెడ్డి, కళ్లం శ్రీనివాసరెడ్డితో పాటు ఆరు కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నేత, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మాజీ ప్రత్యేక ఆహ్వానితులు, స్టేడ్ రెడ్డి కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సూరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సూరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి లక్ష్మారెడ్డి, బొమ్మి కోటిరెడ్డితో పాటు నాలుగు కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన వైసీపీ నేత దొంతిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డితో పాటు రెండు కుటుంబాలు, మంగళగిరి రూరల్ నిడమర్రుకు చెందిన వైసీపీ సీనియర్ నేత కట్టెపోగు బాబురావుతో పాటు 6 కుటుంబాలు, మంగళగిరి రూరల్ యర్రబాలెంకు చెందిన గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణతో పాటు ఐదు కుటుంబాలు తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

*అందరం మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం*

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీరంతా తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల ముందు, తర్వాత నాది ఒక్కటే నినాదం.. మంగళగిరి అభివృద్ధి. మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1 తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చా. ప్రసుతం ఏపీ చూపు మంగళగిరి వైపు ఉంది. అందరం మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం. ఆసుపత్రి నుంచి స్మశానాల వరకు మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్ అందిస్తాం. రెండేళ్లలోనే అన్ని పనులు పూర్తిచేస్తాం. కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేసుకుందాం. మనందరం ఒక కుటుంబం లాంటివాళ్లం. నమ్మితే నేను ఏదైనా చేస్తా.

మంగళగిరి ప్రజలు నన్ను గుండెల్లో పెటుకుని చూసుకున్నారు. 91వేల మెజార్టీతో గెలిపించారు. మనపై బాధ్యత పెరిగింది. తప్పులు చేయకూడదు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. వారికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటా. మూడొందలు, నాలుగొందల ఏళ్ల తర్వాత మంగళగిరిని అప్పట్లో నారా లోకేష్ అభివృద్ధి చేశారని ప్రజలు చెప్పుకుంటే చాలు. అందుకోసం నిరంతరం కష్టపడుతున్నా. నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరికే నా ప్రథమ ప్రాధాన్యత. సమస్యలు ఏవైనా ఉంటే కలిసి పరిష్కరించుకుందాం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తూచా తప్పకుండా పాటించాలని మంత్రి లోకేష్ చెప్పారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.