వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు
వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :నెల్లూరు రూరల్ మండలం వేదగిరి క్షేత్రముగా వెలసి ఉన్న వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ముందుగా వారికి దేవస్థానము ఆచారము ప్రకారం అర్చకస్వాములు , అధికారులు పూర్ణకుంభ మర్యాదలు, వేదమంత్రాలతో స్వాగతము పలికారు.స్వామివారికి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, శేష వస్త్రములు, తీర్థప్రసాదములు, వేద ఆశీర్వచనములు ప్రసాదించారు. దేవస్థానము స్థలపురాణం, విశేషములు గురించి అర్చక స్వాములు అర్చకం మాధవగిరి భాస్కరాచార్యులు, మాధవగిరి వేంకట కృష్ణమాచార్యులు, మాధవగిరి అప్పలాచార్యులు, కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి న్యాయమూర్తులకు వివరించారు.అలాగే ఉన్నతన్యాయమూర్తి దంపతుల వెంట జిల్లా న్యాయమూర్తి ఏ. నరసింహ మూర్తి, మొదటి అధనపు న్యాయమూర్తి భరద్వాజ్ ప్రోటోకాల్ సిబ్బంది, రూరల్ పోలీస్, దేవస్థానము సిబ్బంది తదితరులు పాల్గొన్నారు