BREAKING
అల్యూమినియం అభివృద్ధియే లక్ష్యం భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం ఒడిశా మైనింగ్ సామర్థ్యం, బెంగాల్ వ్యాపార సామర్థ్యంతో బలమైన అల్యూమినియం వ్యాల్యూ చైన్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అల్యూమినియం ఉత్పత్తితో పాటు.. విలువ ఆధారిత వ్యవస్థగా మార్చడం లక్ష డంపింగ్‌ యార్డు తరలించాలి సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ

పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు

Select Suryaa Now
పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు

సూర్య బిజినెస్ డెస్క్: దసరా, దీపావళి తదితర పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎలక్ట్రానిక్స్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకుల ధరలు భగ్గుమంటుండటంతో పాటు విదేశీ మారకద్రవ్య విలువలో హెచ్చుతగ్గులు, రవాణా ఛార్జీలు పెరగడం వంటి కారణాల వల్ల ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఎల్ఈడీ టీవీల ధరలు అక్టోబర్ 1 నుంచి ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు పెరగనున్నట్లు ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థలు వెల్లడించాయి.  

 ప్రధానంగా రాగి, ఉక్కు, అల్యూమినియం వంటి కీలక లోహాల ధరలు విపరీతంగా పెరగడం తయారీదారులపై తీవ్ర భారాన్ని మోపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ముడిసరుకుల వ్యయం గణనీయంగా ఎగబాకడంతో పాటు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సప్లై చెయిన్ వ్యవస్థ దెబ్బతినడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ఏడాదిలో వినియోగ ఎలక్ట్రానిక్స్ రంగం ధరలను సవరించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 

ఇది కూడా చదవండి : ఆర్మానీ వాటా విక్రయం బహుళ ఇన్వెస్టర్ల ప్రమేయం ఉండే అవకాశం

  బ్లూ స్టార్, గోద్రెజ్ అప్లయెన్సెస్, హయర్, డైకిన్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తులపై వివిధ శ్రేణులలో నాలుగు నుంచి పది శాతం వరకు ధరలను పెంచేందుకు సన్నాహాలు చేశాయి. అయితే పండుగ సీజన్ ప్రారంభం కావడంతో పాత నిల్వలు అయిపోయే వరకు ప్రస్తుత ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, ఆ తర్వాతే కొత్త ధరలు పూర్తిగా అమల్లోకి వస్తాయని కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు.