BREAKING
టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ

పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

Select Suryaa Now
పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా
  •  పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలి

పామూరు, మేజర్ న్యూస్ : 

రానున్న స్థానిక ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ  పంకజ్‌కుమార్‌ మీనా ఆదివారం పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పామూరు పోలీస్‌స్టేషన్‌తో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి కేసుల నమోదు, వాటి స్థితిగతులను తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని  ఆదేశించారు. స్టేషన్‌ పరిధిలోని శాంతిభద్రతల గురించి ఆరా తీశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ స్టేషన్‌ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్‌ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి నివారించాలని ఆదేశించారు.రానున్న స్థానిక ఎన్నికల నిమిత్తం సిబ్బందికి కేటాయించిన గ్రామాల్లో సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరిస్తూ ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. సిఐ వినోద్ కుమార్, ఎస్సై అనూక్, సిబ్బంది పాల్గొన్నారు.