చెన్నూరులో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు
చెన్నూరు మేజర్ న్యూస్:
చెన్నూరు మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి కే.శ్రీదేవి తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌లో పంట సాగు చేయని రైతులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటగా మినుము సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు.చెన్నూరు మండలానికి 18 క్వింటాళ్ల మినుము విత్తనాలు సరఫరా చేసినట్లు తెలిపారు.కిలో విత్తనం పూర్తి ధర రూ.129.50 కాగా, ప్రభుత్వం రూ.103.60 సబ్సిడీ అందిస్తుందని,రైతు వాటాగా కేవలం రూ.25.90 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. మినుము సాగు చేయదలచిన రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని ఆధార్ కార్డు,పట్టాదార్ పాస్ పుస్తకంతో సంప్రదించాలని వ్యవసాయ అధికారి సూచించారు.