BREAKING
కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్

కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు!

Select Suryaa Now
కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు!

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

ప్రొద్దుటూరు పట్టణంలో ఆర్టీసీ బస్సుల రూట్ మార్పులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సుల రాకపోకలకు చర్యలు తీసుకుంటున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్ తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద కల్వర్టు మరమ్మతులు పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో వైఎస్సార్‌ సర్కిల్‌ వైపు నుంచి వచ్చే బస్సులు 2 టౌన్ బైపాస్, ఆంధ్రకేసరి రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్‌కు రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్టీసీ బస్సులు బైపాస్ మార్గంలో నడిచేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ప్రైవేట్ బస్సులు ఈ మార్గంలో రాకపోకలు సాగించనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పరిస్థితులను బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.