BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్

Select Suryaa Now
కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్

సూర్య క్రైమ్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరులో పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు యత్నించిన గుట్కా స్మగ్లర్ల దుశ్చర్య కలకలం రేపింది. నిషేధిత గుట్కాను తరలిస్తున్న కారును ఆపేందుకు యత్నించిన హెడ్ కానిస్టేబుల్‌పైకి ఎస్‌యూవీని పోనిచ్చిన నిందితులు, ఆయనను అలాగే ఈడ్చుకుంటూ సుమారు 40 కిలోమీటర్ల దూరం పరారయ్యేందుకు సాహసించారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.  

 కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 250 కిలోలకు పైగా నిషేధిత గుట్కా ఉత్పత్తులను లోడ్ చేసుకుని వెళ్తున్న ఒక ఎస్‌యూవీని ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. ఆ సమయంలో అప్రమత్తమైన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కారు రూఫ్ రైల్స్‌ను గట్టిగా పట్టుకున్నారు. అయినప్పటికీ నిందితులు వాహనాన్ని ఆపకుండా అత్యంత వేగంగా హైవేపైకి దూసుకెళ్లారు.   వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ పైకప్పుపై కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి వేలాడుతున్న ఈ ప్రమాదకర దృశ్యాలను అటుగా వెళ్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అంబులెన్స్ సిబ్బంది గమనించి వీడియో తీశారు.

ఇది కూడా చదవండి : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో

 సమాచారం అందుకున్న తోటి పోలీసులు మరియు స్థానికుల సహకారంతో ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించిన నిందితుల నుంచి భారీగా గుట్కాతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.