BREAKING
ముప్పవరం విద్యార్థిని యజ్ఞశ్రీకి అరుదైన ఘనత.. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపిక.. సంగారెడ్డి బేవరేజ్ కంపెనీల నీటి నాణ్యతపై ఆందోళన.. ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో

Select Suryaa Now
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో

సూర్య మెట్పల్లి : సూర్య తెలంగాణ డెస్క్: జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీవో దరోజు పద్మను కరీంనగర్ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమె ఈ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000 లెక్కన మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు సెప్టెంబర్ 26వ తేదీన ఫిర్యాదుదారుడి నుంచి కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63,000 లంచం నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీవో దరోజు పద్మను అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ఎస్‌పీఈ మరియు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఫిర్యాదుదారుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యక్తిగత వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ధైర్యంగా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.