BREAKING
డంపింగ్‌ యార్డు తరలించాలి సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం

ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన

Select Suryaa Now
ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన

ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన

కూటమి అభ్యర్థులను గెలిపించండి

నెల్లూరు నగర అభివృద్ధికి బాటలు వేయండి.

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, గత కొన్ని రోజులుగా జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో పాత 16వ డివిజన్ – ప్రస్తుత 21వ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం ఈరోజు కూడా ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ప్రతి గడపను పలకరిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ గారు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే చర్యలను కూడా ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పాలనా విధానంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు స్పందించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న తీరును కూడా ప్రజలకు వివరించారు. “ప్రజల వినతి → తక్షణ స్పందన → పరిష్కార దిశగా చర్యలు” అనే విధానానికి ఉదాహరణగా పిఠాపురం పర్యటనలో ప్రజలు అందించిన వినతులపై ప్రభుత్వం స్పందించి, 12 గంటల్లోనే ₹12 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రచారంలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సహకారంతో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  నాయకత్వంలో దేశం ఆర్థికంగా ముందుకు సాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని ప్రజలకు వివరించారు. IMF ప్రచురణలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్లు పేర్కొంది. నెల్లూరు నగర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కూటమి అభ్యర్థులకు మీ విలువైన మద్దతు అందించి గెలిపించాలని ప్రతి గడపను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల , విజయలక్ష్మి గునుకుల, ప్రవల్లిక, ప్రశాంతి, విజయ, సునీత, కృష్ణవేణి, కుమారి,కృష్ణారెడ్డి, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు