BREAKING
బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా టామ్ క్రూయిజ్ డిగ్గర్ సినిమాపై ఆస్కార్ అంచనాలు.. ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటు ఆసక్తికర వ్యాఖ్యలు సాయుధ బలగాల అంతరిక్ష సామర్థ్యాల పెంపునకు స్కైరూట్‌కు నేవీ చీఫ్ ఆహ్వానం ఆస్ట్రేలియా సెనేట్ విచారణకు ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈఓలకు పిలుపు యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం

పల్లె పండుగకు రామాపురం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి

Select Suryaa Now
పల్లె పండుగకు రామాపురం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి  గొట్టిపాటి

- 29న పల్లె పండుగ-3.0 ప్రారంభోత్సవం

- సీఎం, చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలన

   సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

ఈ నెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా వరికుంటపాడు మండలంలోని రామాపురం వద్ద జరగనున్న కార్యక్రమానికి సంబంధించి ఆదివారం సాయంత్రం  రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. టీడీపీ ముఖ్య నేతలతో కలిసి రామాపురంలో పర్యటించిన ఆయన కార్యక్రమ ప్రాంగణం, సభా వేదిక, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, రాకపోకలు, పార్కింగ్‌ తదితర అంశాలపై నేతలతో చర్చించారు. కార్యక్రమ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.29న జరిగే పల్లె పండుగ-3.0 ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు టీడీపీ ముఖ్య నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కోఆర్డినేటర్‌, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, ఏపీ మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.కె.చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.