BREAKING
జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా టామ్ క్రూయిజ్ డిగ్గర్ సినిమాపై ఆస్కార్ అంచనాలు.. ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటు ఆసక్తికర వ్యాఖ్యలు సాయుధ బలగాల అంతరిక్ష సామర్థ్యాల పెంపునకు స్కైరూట్‌కు నేవీ చీఫ్ ఆహ్వానం ఆస్ట్రేలియా సెనేట్ విచారణకు ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈఓలకు పిలుపు యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం మహిళల చేతుల్లో ఉపాధి మిషన్ చెన్నూరులో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు

గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు

Select Suryaa Now
గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు

*అంకెవానిపల్లె గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు*

 

లింగాల మేజర్ న్యూస్: లింగాల మండలం అంకెవానిపల్లె గ్రామంలో చాలా రోజుల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురవడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ మహిళలు బిందెలతో నీటిని తీసుకువచ్చి గంగమ్మ తల్లికి నీరు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు కోరుకున్నారు.
రాబోయే రోజుల్లో కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు బాగా పండాలని గ్రామ ప్రజలు గంగమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ ప్రత్యేక ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే గ్రామ పెద్దలు యూత్
పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.