BREAKING
బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా టామ్ క్రూయిజ్ డిగ్గర్ సినిమాపై ఆస్కార్ అంచనాలు.. ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటు ఆసక్తికర వ్యాఖ్యలు సాయుధ బలగాల అంతరిక్ష సామర్థ్యాల పెంపునకు స్కైరూట్‌కు నేవీ చీఫ్ ఆహ్వానం ఆస్ట్రేలియా సెనేట్ విచారణకు ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈఓలకు పిలుపు యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం

పుష్కర ఘాట్ లో మన అడవులు తీరానికి పర్యాటక సొగసులు

Select Suryaa Now
పుష్కర ఘాట్ లో మన అడవులు తీరానికి పర్యాటక సొగసులు

పుష్కరాలకు ముందే.. తీరం మేల్కొనాలి

చొల్లంగి–అంతర్వేది మధ్య పర్యాటకానికి అపార అవకాశాలు

ఘాట్ల పునరుద్ధరణ నుంచి హోప్‌ ఐలాండ్‌ వరకు ప్రభుత్వానికి నాగరమేష్‌ ప్రతిపాదనలు

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో,

( కాకినాడ)
ఓ వైపు గోదావరి.. మరోవైపు సముద్ర తీరం. మధ్యలో మడ అడవులు, నదీ సంగమాలు, దీవులు. ప్రకృతి ఇచ్చిన ఇన్ని ప్రత్యేకతలున్నా చొల్లంగి నుంచి అంతర్వేది వరకు వాటిని కలిపే సమగ్ర పర్యాటక ప్రణాళిక ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. రాబోయే గోదావరి పుష్కరాలను ఇందుకు అవకాశంగా మలచాలని సామాజిక కార్యకర్త దిండి నాగరమేష్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పుష్కరాల వేళ తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టకుండా ఇప్పటి నుంచే స్నానఘట్టాలను పునరుద్ధరించి, తీర ప్రాంతానికి శాశ్వత పర్యాటక మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

పుష్కరాలు దగ్గరపడిన తర్వాత పనులు మొదలుపెడితే భక్తుల అవసరాలకు తగ్గ ఏర్పాట్లు చేయడం కష్టమవుతుందని నాగరమేష్‌ పేర్కొన్నారు. స్నానఘట్టాల పరిస్థితిని ముందుగానే పరిశీలించి అవసరమైన చోట పునరుద్ధరణ చేపట్టడంతోపాటు రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి వసతులపై ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు.

తీరాన్ని కలిపితే..

చొల్లంగి రేవు నుంచి అంతర్వేది వరకు ఉన్న ప్రాంతాన్ని ఒక్కో పర్యాటక కేంద్రంగా కాకుండా ఒకే పర్యాటక వలయంగా చూడాలన్నది నాగరమేష్‌ ప్రధాన ప్రతిపాదన. సముద్ర తీరం, నదీ సంగమాలు, మడ అడవులు, దీవులను అనుసంధానిస్తూ అనువైన ప్రాంతాల్లో బోటింగ్‌ సదుపాయాలు కల్పిస్తే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించవచ్చని పేర్కొన్నారు. అదే సమయంలో మడ అడవుల పరిరక్షణపై అవగాహన పెంచేలా పర్యాటక ప్రణాళిక ఉండాలని సూచించారు.

కాకినాడ తీరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న హోప్‌ ఐలాండ్‌ పర్యాటక అవకాశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పర్యావరణానికి భంగం కలగకుండా నియంత్రిత పర్యాటకం, బోటు ప్రయాణాలు, సందర్శకులకు అవసరమైన సదుపాయాలపై అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పుష్కరాలతోనే ఆగిపోకుండా..

పుష్కరాల కోసం వెచ్చించే నిధులతో చేపట్టే పనులు ఒక్క ఉత్సవానికే పరిమితం కాకుండా ఆ తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడాలని నాగరమేష్‌ కోరుతున్నారు. తీర పర్యాటకం విస్తరిస్తే స్థానిక యువతకు ఉపాధి, చిన్న వ్యాపారాలకు అవకాశాలు పెరగడంతోపాటు కాకినాడ–కోనసీమ తీరానికి రాష్ట్ర పర్యాటక పటంలో మరింత గుర్తింపు తీసుకురావచ్చని ఆయన ప్రభుత్వం ముందుంచారు.