ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు
సూర్య ఆర్మూర్ ప్రతినిధి, అమాయకుల అవసరాలను ఆసరా చేసుకుంటూ తెలిసి తెలియని వైద్యం చేయడం మూలంగా అమాయకుడు అనారోగ్యానికి గురయ్యాడు.ఎటు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి సహాయం చేసి న్యాయం చేయాలని వేడుకుంటున్న వైనం..ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన షేక్ అమీర్ గత ఐదు నెలల క్రితం పైల్స్ చికిత్స విషయమై కమల నెహ్రూ కాలనీ లో గల ప్రియాంక క్లినిక్ వైద్యుడు సమీర్ రాయ్ ను సంప్రదించాడు. డబ్బులు దండుకున్న వైద్యుడు అచ్చిరాని వైద్యం చేయడంతో పైల్స్ ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీంతో బాధితుడు మూడు నెలలుగా భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. అనారోగ్యం సరి కాకపోవడంతో ఇతర ఆసుపత్రులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ సరిగా చేయలేదని మళ్లీ ఆపరేషన్ చేయించుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదని సూచించారు. లేనిపక్షంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో అర్థం కాని పరిస్థితినీ ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు తీవ్రమైన కడుపునొప్పి రక్తంతో కూడిన మలం రావడంతో భరించలేని అవస్థను ఎదుర్కొంటున్నాడు. మరోవైపు చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో ఆర్థిక పరిస్థితి అధిక మించలేకపోతున్నాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో అచ్చిరానీ వైద్యం కారణంగా కూలి పని చేయలేక పోతున్నానని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత పరిస్థితులలో అధికారులే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్,డి ఎం హెచ్ ఓ, వైద్యాధికారులు సహకార అందించాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా, ప్రైవేట్ ఆసుపత్రులలోనైన తనకు ఉచితంగా ఆపరేషన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని బ్రతిమాలుకోనుచున్నాడు. కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, వైద్యాధికారుల సిఫారసుతో ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ డాక్టర్ సమీర్ రాయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం విధితమే. ఏదేమైనప్పటికీ ఒక నకిలీ డాక్టర్ చేతిలో బలైన బాధితునికి జిల్లా స్థాయి అధికారులు అండగా నిలిచి తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల సంబంధిత అధికారులు కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారుల పై ఉంది…నా దీన స్థితిని పట్టించుకోండి సార్లు...షేక్ అమీర్ (బాధితుడు). నా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో కాని, ప్రైవేట్ ఆసుపత్రులలోనైన ఉచితంగా వైద్య చికిత్స అందించి సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఉంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను చాలా పేదరికంలో ఉన్నాను. నయాపైస కూడ లేదు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, డిఎంహెచ్ఓ లకు నా యొక్క వినతి.