రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబర్, 27);
ఘట్‌కేసర్ డివిజన్ బాలాజీ నగర్ లో డైమండ్ యూత్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడి లడ్డూకు వేలంలో భారీ ధర పలికింది. నిర్వహించిన వేలం పాటలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి రూ.1,06,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా మాధవ్ రెడ్డి- మమత, కుమారుడు ప్రణయ్ రెడ్డి–రమ్య దంపతులను డైమండ్ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానికులు, యువజన సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.రిపోర్టర్ గుర్రం రమేష్.