BREAKING
బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా టామ్ క్రూయిజ్ డిగ్గర్ సినిమాపై ఆస్కార్ అంచనాలు.. ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటు ఆసక్తికర వ్యాఖ్యలు సాయుధ బలగాల అంతరిక్ష సామర్థ్యాల పెంపునకు స్కైరూట్‌కు నేవీ చీఫ్ ఆహ్వానం ఆస్ట్రేలియా సెనేట్ విచారణకు ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈఓలకు పిలుపు యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం బహుళ ఇన్వెస్టర్ల ప్రమేయం ఉండే అవకాశం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం

జలదృశ్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు బాపూజీకి భారతరత్న తోనే నిజమైన నివాళి జలదృశ్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బీసీల రాజ్యాధికారమే బాపూజీ ఆశయ సాధనకు నిలువుటద్దం : దాసు సురేశ్

Select Suryaa Now
జలదృశ్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు  బాపూజీకి భారతరత్న తోనే నిజమైన నివాళి  జలదృశ్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు  మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ  బీసీల రాజ్యాధికారమే బాపూజీ ఆశయ సాధనకు నిలువుటద్దం : దాసు సురేశ్


తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమ యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, చేనేత కార్మికుల హక్కుల పరిరక్షకుడు, బీసీ–బహుజన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌లోని జలదృశ్యం ప్రాంగణంలో ఉన్న బాపూజీ విగ్రహం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన “కొండా లక్ష్మణ్ బాపూజీ జ్ఞాపకాల్లో ఆత్మీయ సభ”లో పలువురు రాజకీయ, సామాజిక, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్లు బి ఎస్ రాములు,వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి బీసీ సలహాదారు వి. హనుమంతరావు, వివిధ బీసీ సంఘాల నాయకులు, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు, బీసీ సంక్షేమ సంఘం మేకపోతుల నరేందర్ గౌడ్, నగేష్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గం తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, చేనేత రంగం అభివృద్ధికి బాపూజీ చేసిన సేవలు చారిత్రాత్మకమని కొనియాడారు. బాపూజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం రాజీ లేని పోరాటం చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు..మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నాయకుడే నిజమైన నాయకుడని, అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కొండా లక్ష్మణ్ బాపూజీదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ కలలుగన్న సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం, బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం సాధించే వరకు తమ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఇప్పటికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కకపోవడం బాధాకరమని పేర్కొంటూ, బీసీలకు సముచిత వాటా, రాజ్యాధికారం సాధన దిశగా మరింత బలంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్లస్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాధం మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాన్ని సామాజిక న్యాయం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంకితం చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తవు మురళి మాట్లాడుతూ, పద్మశాలి సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను ఎప్పటికీ మరువదని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి సీఈఓ పోశాల సరస్వతి, పద్మశాలి సంఘం ప్రతినిధులు శారద, దుష్యంతల , గుంటక రూప, బోనం ఊర్విలా, బొమ్మ నరేంద్ర, పద్మశాలి సంఘం పోపా అధ్యక్షుడు తిరుందాసు యాదవ్, కార్యదర్శి గోళి వినోద్, బీసీ రాజ్యాధికార సమితి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉరుగొండ శివ, మారేపల్లి లక్ష్మణ్, వాసాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బీసీ, బహుజన వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కోసం ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.