BREAKING
యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం మహిళల చేతుల్లో ఉపాధి మిషన్ చెన్నూరులో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు కార్మికుల దోపిడీ కేసులో మిలాన్ యుఎస్ కాన్సులేట్ నిర్మాణ సంస్థకు భారీ షాక్ మితిమీరిన స్క్రీన్ సమయం, తప్పుడు కూర్చునే భంగిమలతో చిన్నారుల వెన్నెముకకు తీవ్ర ముప్పు.. ఫిజియోథెరపీ నిపుణుల హెచ్చరిక బ్రిటన్ ఎయిర్ బేస్ సమీపంలో టెర్రరిజం యాక్ట్ కింద ఐదుగురి అరెస్ట్ బిల్లీ జీన్ కింగ్ కప్‌ విజేతగా చెక్ రిపబ్లిక్ త్రిపుర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే చోదక శక్తిగా మారుతోంది.. ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెల్లడి కొరియా సరిహద్దు డిఎమ్‌జడ్‌లో భారీ పేలుడు టర్కీ రాజకీయంలో సంచలనం పల్లె పండుగకు రామాపురం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి

యుఎల్‌సి దరఖాస్తులకు మోక్షం - దశాబ్దాల సమస్యకు తెరదించే దిశగా ప్రభుత్వ అడుగులు

Select Suryaa Now
యుఎల్‌సి దరఖాస్తులకు మోక్షం - దశాబ్దాల సమస్యకు తెరదించే దిశగా ప్రభుత్వ అడుగులు

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి :  కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్‌సి) దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.  గత ప్రభుత్వం 2016లోనే యుఎల్‌సి కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీవో జారీ చేసినప్పటికీ, దానిని అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని  తెలిపారు. 
ఫలితంగా ప్రజలు తమ భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సంకల్పానికి అనుగుణంగా సహచర క్యాబినెట్ మంత్రులతో చర్చించి 22ఏ  సమస్యలకు  ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

యుఎల్‌సి  పెండింగ్ దరఖాస్తులపై తాజా నిర్ణయం

తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యుఎల్‌సి) కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని  స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.  ఈ మేరకు  గతంలో  జారీ చేసిన జీ ఓ  నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ యుఎల్‌సి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా ఆదివారం నాడు 
మెమో .సంఖ్య .48062/యుఎల్‌సి/ఏ 1/2026-1,  జారీ చేసినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి క్రమబద్ధీకరణ చర్యలు  తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. 
యుఎల్‌సి సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం 2016లో జీవో జారీ చేసినప్పటికీ, ఆ జీవోను  అమలు చేయకపోవడంతో  ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు.

22ఏ  సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం

ఈ నెల 16న శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   సెక్షన్ 22ఏ తో ముడిపడి ఉన్న 10–12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికే 22ఏ  సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం,  ఆ తర్వాత  జి.ఓ 118 కు అనుగుణంగా మెమో జారీ, ఆ వెంటనే జి .ఓ 76 కు అనుగుణంగా మెమో ఇవ్వడం జరిగిందన్నారు. 22 ఎ లో ఉన్నప్పటికీ జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, డిటిసిపి, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఉత్తరులు జారీ చేయడం జరిగిందన్నారు.  తాజాగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యుఎల్‌సి  దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చామన్నారు.  మిగిలిన అన్ని సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపిస్తామని తెలిపారు. “దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని,  వారికి  ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి భూ సమస్యను పరిశీలించి, చట్టం, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడమే  తమ ప్రభుత్వ ప్రథమ  లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.