BREAKING
పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికలకు 245 పోలింగ్ స్టేషన్ల తుది జాబితా

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

Select Suryaa Now
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
- అక్టోబర్ 9న పోలింగ్ - బస్సు డిపోల్లో రగులుతున్న కార్మిక పోరు
సూర్య నిజామాబాదు జిల్లా ప్రతినిధి : టీఎస్‌ఆర్టీసీ (TSRTC) లో మరోసారి ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా, కార్మిక లోకానికి పెద్ద దిక్కుగా నిలిచే "గుర్తింపు సంఘం" కోసం మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. కేవలం మాటల యుద్ధం కాకుండా, అత్యంత పకడ్బందీగా సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలను నిర్వహించడానికి నిజామాబాదు జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో బరిలో నిలిచిన 12 కార్మిక సంఘాలకు గుర్తులను అధికారికంగా కేటాయించగా, అక్టోబర్ 9న జరగనున్న పోలింగ్ కోసం కార్మిక సంఘాలు సర్వసన్నద్ధo అవుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి సంఘం తూచా తప్పకుండా పాటించాలని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో బరిలో నిలిచిన సంఘాలు మరియు వాటికి కేటాయించిన గుర్తుల వివరాలు ఇలా ఉన్నాయి.ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కి బస్సు గుర్తు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కు నిచ్చెన గుర్తు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్.డబ్ల్యూ.ఎఫ్) కి నక్షత్రం గుర్తు, నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) కి దివిటీ పట్టుకున్న చేయి గుర్తు కేటాయించబడ్డాయి. అలాగే కార్మిక సంఘానికి పులి, కార్మిక పరిషత్ కు బస్సు టైరు, బహుజన వర్కర్స్ యూనియన్ కి కత్తెర, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు విల్లు-బాణం, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కి త్రాసు, సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు బతుకమ్మ, బహుజన కార్మిక యూనియన్ కి ధర్మ చక్రం, మరియు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కు గద గుర్తును కేటాయించారు.ఈ ఎన్నికల్లో ఏకంగా 12 సంఘాలు పోటీ పడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. కార్మికుల మన్నలను పొందడానికి ప్రతి యూనియన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ 9న జరిగే పోలింగ్‌లో కార్మికులు ఏ గుర్తింపు సంఘానికి పట్టం కడతారనే ఉత్కంఠ ఇప్పుడు ఆర్టీసీ సర్వత్రా నెలకొంది.