రూ.97 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న బొబ్బల దంపతులు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబర్, 27):
అంకుషాపూర్ లో స్వామి వివేకానంద ఆర్ట్స్ అసోసియేషన్ 38వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ ఊరేగింపు, లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. బొబ్బల ప్రేమలత–శ్రీనివాస్ రెడ్డి, ప్రణయ్–సాయికిరణ్ రెడ్డి దంపతులు రూ.97 వేలకు లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఏలిమినేటి రణధీర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రేష్మిత్ రెడ్డి, నితిన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బద్దం అర్చన నరసింహ రెడ్డి, ఏలిమినేటి శ్రీనివాస్ రెడ్డి, బద్దం కృష్ణారెడ్డి, ప్రవీణ్ రావు, కార్తీక్ రెడ్డి, సాయికుమార్, మాధవ్, నూతన్ తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ గుర్రం రమేష్.