BREAKING
బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా టామ్ క్రూయిజ్ డిగ్గర్ సినిమాపై ఆస్కార్ అంచనాలు.. ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటు ఆసక్తికర వ్యాఖ్యలు సాయుధ బలగాల అంతరిక్ష సామర్థ్యాల పెంపునకు స్కైరూట్‌కు నేవీ చీఫ్ ఆహ్వానం ఆస్ట్రేలియా సెనేట్ విచారణకు ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈఓలకు పిలుపు యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం బహుళ ఇన్వెస్టర్ల ప్రమేయం ఉండే అవకాశం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం

ఆస్ట్రేలియాలో బీజేపీ చీఫ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ వీరి సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా హాజరు రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఈ భేటీ నేతల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్

Select Suryaa Now
ఆస్ట్రేలియాలో బీజేపీ చీఫ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ  వీరి సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా హాజరు  రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఈ భేటీ   నేతల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్

ఆస్ట్రేలియాలో బీజేపీ చీఫ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ

వీరి సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా హాజరు

రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఈ భేటీ 

నేతల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ 

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా, అక్కడే ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం. ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ముగ్గురు నేతలు కలుసుకున్నారు. వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందిన ఈ నేతలు ఒకేచోట సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సమావేశంపై జోరుగా చర్చ జరుగుతోంది.