ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్!
-అమ్మోనియా ఎల్బో పైప్ లీకేజీ.. మంటలు చెలరేగినట్లు సమాచారం
సూర్య-గోదావరిఖని:రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)లో శనివారం అమ్మోనియా ఎల్బో పైప్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఆదివారం కర్మాగారాన్ని షట్‌డౌన్ చేసి, యూరియా ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. గతంలోనూ RFCLలో సాంకేతిక సమస్యల కారణంగా దీర్ఘకాలికంగా ఉత్పత్తి నిలిచిన సందర్భాలు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సమస్యల కారణంగా 112 రోజుల పాటు ఉత్పత్తి నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి. తాజా షట్‌డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది? యూరియా ఉత్పత్తి ఎప్పుడు పునఃప్రారంభమవుతుంది? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.