BREAKING
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

+అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు +16న గరుడసేవ.. 17న పుష్పక విమానం.. 19న స్వర్ణరథం.. 20న చక్రస్నానం

Select Suryaa Now
+అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు  +16న గరుడసేవ.. 17న పుష్పక విమానం.. 19న స్వర్ణరథం.. 20న చక్రస్నానం

తిరుమల, మేజర్ న్యూస్ :తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికమాసం వచ్చే సందర్భాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం నిర్వహించరు.

ప్రతిరోజూ ఉదయం వాహనసేవలు సాధారణంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవలు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవను అక్టోబర్‌ 16న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

???? వాహనసేవల వివరాలు

అక్టోబర్‌ 11:

???? అంకురార్పణం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు

అక్టోబర్‌ 12:

???? బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు

???? పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబర్‌ 13:

???? చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు

???? హంస వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబర్‌ 14:

???? సింహ వాహనం – ఉదయం 8 గంటలకు

???? ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబర్‌ 15:

???? కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు

???? సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబర్‌ 16:

???? మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు

???? గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు

అక్టోబర్‌ 17:

???? హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు

???? పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు

???? గజ వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబర్‌ 18:

???? సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు

???? చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబర్‌ 19:

???? స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు

???? అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబర్‌ 20:

???? చక్రస్నానం – ఉదయం 6 గంటలకు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా గరుడసేవ, పుష్పక విమానం, స్వర్ణరథం, చక్రస్నానం రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.