BREAKING
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

కరుడుగట్టిన టిడిపి రాష్ట్ర సీనియర్ నేత, బడుగుల పెన్నిధి శీలం వెంకటేశ్వరరావు --నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో రాష్ట్ర స్థాయి గుర్తింపు

Select Suryaa Now
కరుడుగట్టిన టిడిపి రాష్ట్ర సీనియర్ నేత, బడుగుల పెన్నిధి శీలం వెంకటేశ్వరరావు --నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో  రాష్ట్ర స్థాయి గుర్తింపు

 కరుడుగట్టిన టిడిపి రాష్ట్ర సీనియర్ నేత, బడుగుల పెన్నిధి శీలం వెంకటేశ్వరరావు --నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో  రాష్ట్ర స్థాయి గుర్తింపు

టి.నర్సాపురం, మేజర్ న్యూస్ : గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన శీలం వెంకటేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు,ఎన్నో సేవలు, ఎన్నో మలుపులు.ఈసారి ఆయనకు మరింత గుర్తింపు,గౌరవం తెచ్చే రాష్ట్ర స్థాయి పదవి రాబోతుందంటూ ఆయన అనుచరులు చెప్పకనే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,అదేవిధంగా యువ నేత ,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆశయాలు, ఆదేశాలు , సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్న శీలం  వెంకటేశ్వరరావు కు భవిష్యత్తులో రాజకీయ ఉన్నత స్థానం లభించే అవకాశాలున్నట్టు విధితమవుతోంది. బీసీ నేత అయినప్పటికీ ఆయన కు అన్ని వర్గాల్లో అనుచరగణంతో పాటు , వారికి అన్ని రంగాలలో చేదోడువాదోడుగా ఉంటూ, స్నేహశీలిగా,బంధువుగా, మిత్రుడిగా,రాజకీయ నేతగా ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నారు.కాగా పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో శీలం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండడం విశేషం. నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన నాయకుడు శీలం వెంకటేశ్వరరావు. ఏలూరు జిల్లా మెట్ట ప్రాంత రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఆయన పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న సందర్భాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.

టి.నరసాపురం మండలం వీరభద్రవరం శీలం వెంకటేశ్వరరావు స్వగ్రామం.బీసీల్లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన శీలం కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతోంది.వెలగపాడు పంచాయతీ పరిధిలో నాలుగు దశాబ్దాలుగా ఈ కుటుంబానికి రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. వారి కుటుంబం వరుస రాజకీయ పదవులు చేపట్టారు. 

శీలం వెంకటేశ్వరరావు తండ్రి నారాయణతో పాటు శీలం వెంకటేశ్వరరావు,ఆయన సతీమణి సుజాత కూడా వివిధ రాజకీయ పదవులు చేపట్టారు. సర్పంచ్‌,ఎంపీటీసీ, జడ్పీటీసీ,ఎంపీపీ,సొసైటీ చైర్మన్‌ వంటి పదవులు ఈ కుటుంబ రాజకీయ ప్రస్థానంలో భాగమయ్యాయి.

-- 'శీలం'  రాజకీయ ప్రస్థానం -      గతంలోటిడిపి రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర నీటి పారుదల శాఖ డైరెక్టర్ గా పలమనేరు నియోజవర్గం లో కూడా పార్టీ ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వహించారు.1995లో టి.నర్సాపురం మండలంలోని మల్లుకుంట సొసైటీ చైర్మన్‌గా 

2001లో వెలగపాడు సర్పంచ్‌గా , 

2006లో టి.నరసాపురం జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు.

2013లో మల్లుకుంట సొసైటీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికయ్యారు.

2014లో రాజుపోతేపల్లి ఎంపీటీసీగా గెలిచి టి.నరసాపురం ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు.

శీలం తండ్రి నారాయణ 1988 నుంచి 1996 వరకు వరుసగా ఎనిమిదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. అంతకుముందు కూడా సర్పంచ్‌గా పనిచేసిన రాజకీయ అనుభవం ఆయనకు ఉంది.

--సతీమణికి కూడా రాజకీయ విజయాలు--

శీలం వెంకటేశ్వరరావు సతీమణి సుజాత కూడా స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 2006లో సర్పంచ్‌గా, 2014లో వెలగపాడు ఎంపీటీసీగా విజయం సాధించారు.వెలగపాడు పంచాయతీలో గత నాలుగు దశాబ్దాలుగా జరిగిన ఎన్నికల్లో ఒక టర్మ్ మినహా మిగిలిన సందర్భాల్లో శీలం కుటుంబ సభ్యులు లేదా కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారు విజయం సాధించినట్లు స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వెలగపాడు పంచాయతీ టీడీపీకి బలమైన రాజకీయ స్థావరంగా కొనసాగుతోంది.

ప్రతిపక్షంలోనూ పార్టీ కోసం పోరాటం కొనసాగించారు. 

2011 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ పదవి కోసం చివరి దశ వరకు ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ అవకాశం దక్కలేదు.

-- రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు --

గత ఎన్నికల అనంతరం టీడీపీ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల్లో శీలం వెంకటేశ్వరరావుకు చోటు లభించింది. ప్రస్తుతం ఆయన టీడీపీ పార్టీలో సేవలందిస్తూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు . 

రాష్ట్ర కమిటీలోకి వచ్చిన అనంతరం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహించారు.ప్రస్తుతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

--తదుపరి అడుగు ఎటు?--

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శీలం వెంకటేశ్వరరావుకు భవిష్యత్తులో మరింత కీలకమైన బాధ్యతలు దక్కే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. అటు చింతలపూడి ఇటు పోలవరం నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశ పార్టీ నాయకులు, కార్యకర్తలతో  అందరితో సన్నిహితంగా ఉండే వ్యక్తి శీలం అని చెప్పుకోవచ్చు. దశాబ్దాల రాజకీయ అనుభవం, పార్టీతో సుదీర్ఘ అనుబంధం, స్థానికంగా కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం వంటి అంశాలు ఆయనకు ప్రాధాన్యత కల్పించే అంశాలుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004 నుంచి2014 వరకు,2019 నుంచి 2024 వరకు, ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందించారు అని చెప్పుకోవచ్చు .ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన సమయంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చిన పార్టీని వీడకుండా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ, కరుడు కట్టిన నేతగా పనిచేశారు శీలం  వెంకటేశ్వరరావు . రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయనకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌? లేదా ఎమ్మెల్సీ? వంటి పదవుల్లో ఏదైనా అవకాశం లభిస్తుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ గా మారింది.శీలం వెంకటేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో 2026-27 మరో కీలక అధ్యాయంగా మారుతుందా? రాష్ట్రస్థాయి పదవి లభిస్తుందా ? లేక జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు పార్టీలో అప్పగిస్తారా ? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

 

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్